భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా 'గూగుల్' ప్రత్యేక డూడుల్

  • ఇస్రో సాధించిన విజయాలను సూచించేలా డూడుల్
  • గగన్‌యాన్, చంద్రయాన్ వంటి ఇస్రో మిషన్లతో డూడుల్
  • అంతరిక్షం, గ్రహాలు, కక్ష, ఉపగ్రహ నమూనాలతో డూడుల్
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ సెర్చింజన్ 'గూగుల్' భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సాధించిన విజయాలను సూచించేలా డూడుల్‌ను రూపొందించి శుభాకాంక్షలు తెలిపింది. రంగురంగుల్లో రూపొందించిన ఈ డూడుల్ అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రతిబంబిస్తోంది. గగన్‌యాన్, చంద్రయాన్ వంటి ఇస్రో మిషన్లను అందులో చూడవచ్చు.

గూగుల్ రూపొందించిన డూడుల్‌లో అంతరిక్షం, గ్రహాలు, కక్ష, ఉపగ్రహ నమూనాలు ఉన్నాయి. వాటన్నింటినీ త్రివర్ణ పతాకంలోని రంగులతో రూపొందించింది. 'ఎల్' అక్షరాన్ని ఆకాశమే హద్దుగా నింగిలోకి దూసుకెళుతున్న రాకెట్‌గా తీర్చిదిద్దింది. ఈ డూడుల్ శాస్త్ర సాంకేతిక రంగంలో మన శాస్త్రవేత్తల విజయాన్ని ప్రతిబింబిస్తోంది.


More Telugu News