ఆర్బీఐలో ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే చాలు, అంతకుమించితే అనర్హతే..!
- అటెండెంట్ ఉద్యోగాలకు ప్రకటన జారీ చేసిన ఆర్బీఐ
- మొత్తం 572 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- ఆన్ లైన్ లో దరఖాస్తు.. ఫిబ్రవరి 24 గడువు
పదో తరగతి కనీస అర్హత కలిగిన ఉద్యోగాలకూ పీజీ, పీహెచ్ డీ చేసిన అభ్యర్థులు పోటీపడుతుంటారు. దీంతో పదోతరగతితో చదువు ఆపేసిన వారికి ఆ ఉద్యోగం దొరికే అవకాశాలు తగ్గిపోతాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ తాజా నోటిఫికేషన్ లో కీలకమైన షరతు విధించింది. అటెండెంట్ ఉద్యోగానికి పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు సరిపోతారని వివరిస్తూ.. ఉన్నత విద్యావంతులను ఈ పోస్టులకు అనర్హులుగా ప్రకటించింది. ఉన్నత విద్యార్హతలు ఈ పోస్టులకు అనర్హతగా పరిగణిస్తామని వెల్లడించింది.
వయస్సు: 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు (రిజర్వేషన్ల ప్రకారం మినహాయింపులు)
భాషా సామర్థ్యం: అభ్యర్థి దరఖాస్తు చేసుకునే రాష్ట్రం, రీజియన్ లకు చెందిన భాషలో స్పష్టంగా మాట్లాడగలగాలి. రాయడం, చదవడం వచ్చి ఉండాలి.
దరఖాస్తు రుసుము: ఆన్ లైన్ లో ఫిబ్రవరి 24 లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుముగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు రూ.50 (జీఎస్టీ అదనం) చెల్లించాలి. ఇతరులు రూ.450 (జీఎస్టీ అదనం) ఆన్ లైన్ లో చెల్లించాలి.