అనిల్ రావిపూడికి స్పోర్ట్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన చిరంజీవి... ఫొటోలు ఇవిగో!

  • దర్శకుడు అనిల్ రవిపూడికి చిరంజీవి ఖరీదైన బహుమతి
  • బ్రాండ్ న్యూ రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును బహూకరించిన మెగాస్టార్
  • 'మన శంకరవర ప్రసాద్' సినిమా భారీ విజయం సందర్భంగా ఈ కానుక
  • రూ.292 కోట్లకు పైగా వసూళ్లతో ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన MSG
  • సక్సెస్ సెలబ్రేషన్స్ నైట్‌లో ఈ సర్‌ప్రైజ్ ఇచ్చిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన చిత్ర దర్శకుడు అనిల్ రవిపూడికి ఓ విలువైన బహుమతి ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఇటీవల వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకరవర ప్రసాద్’ (MSG) సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సందర్భంగా, అనిల్‌కు చిరంజీవి సరికొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును బహూకరించారు.

సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.292 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, తెలుగు సినీ పరిశ్రమలో ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్‌గా, చిరంజీవి కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సెలబ్రేషన్ నైట్‌లో చిరంజీవి ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను అనిల్ రవిపూడికి అందించారు.

గతంలో అనిల్ రవిపూడి పుట్టినరోజు సందర్భంగా కూడా చిరంజీవి ఓ ఖరీదైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో ఏకంగా లగ్జరీ కారునే బహుమతిగా ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు. చిత్ర పరిశ్రమలో ఇలాంటి ఖరీదైన బహుమతులు అరుదుగా ఉంటాయి. దర్శకుడి ప్రతిభను, సినిమా విజయాన్ని పురస్కరించుకుని చిరంజీవి ఇచ్చిన ఈ మెగా గిఫ్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


More Telugu News