ఇష్యూని తప్పుదోవ పట్టించారు: ట్రోలింగ్ పై రేణూ దేశాయ్ స్పందన

  • తనను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేయడం వల్ల ఎలాంటి లాభం లేదన్న రేణూ దేశాయ్
  • తాను చెప్పిన ఉద్దేశాన్ని పక్కన పెట్టి, ఇష్టం వచ్చిన రీతిలో వీడియోలను వైరల్ చేస్తూ అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపణ
  • అన్ని కుక్కలను ఇబ్బంది పెట్టడం ఏమాత్రం భావ్యం కాదన్న రేణూ దేశాయ్
వీధి కుక్కల దాడి ఘటనలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. తనను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, సమస్య పరిష్కారం కాదని ఆమె స్పష్టం చేశారు.

ఇటీవల వీధి కుక్కల సమస్యపై తాను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి 30 నిమిషాలకు పైగా సుదీర్ఘంగా మాట్లాడానని, అయితే అందులో కొన్ని మాటలను మాత్రమే తీసుకుని వక్రీకరించారని రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పిన ఉద్దేశాన్ని పక్కన పెట్టి, ఇష్టం వచ్చిన రీతిలో వీడియోలను వైరల్ చేస్తూ అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తనపై ట్రోల్స్ చేయిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆమె పేర్కొన్నారు.

కొన్ని కుక్కలు మనుషులను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే కావొచ్చని, కానీ ఆ కారణంతో వీధుల్లో ఉన్న అన్ని కుక్కలను ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సబబు కాదని రేణు దేశాయ్ అభిప్రాయపడ్డారు. 


More Telugu News