దావోస్‌లో రేవంత్ రెడ్డితో చిరంజీవి

  • పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్‌కు వెళ్లిన రేవంత్ రెడ్డి
  • జ్యూరిక్ లో చిరంజీవి ఉన్నట్టు తెలుసుకున్న రేవంత్
  • దావోస్‌కు రావాలంటూ చిరంజీవికి ఆహ్వానం
  • రేవంత్ ఆహ్వానం మేరకు దావోస్‌ వెళ్లిన మెగాస్టార్

స్విట్జర్లాండ్లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కీలక అధికారులు హాజరయ్యారు.


సదస్సులో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ లో చిరంజీవి ఉన్నట్టు తెలుసుకున్న రేవంత్ రెడ్డి... సదస్సుకు ఆయనను ఆహ్వానించారు. రేవంత్ ఆహ్వానం మేరకు దావోస్ సదస్సుకు చిరంజీవి వెళ్లారు. ఈ సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించిన “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్‌ను చిరంజీవి ఆసక్తిగా వీక్షించారు.


ఈ సందర్భంగా చిరంజీవితో రేవంత్ ముచ్చటిస్తూ... ఇటీవల కుటుంబంతో కలిసి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను చూశానని, సినిమా చాలా బాగుందని తెలిపారు. చిరంజీవికి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం చిరంజీవి స్విట్జర్లాండ్‌లో ఫ్యామిలీ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.



More Telugu News