సోనీ సంచలన నిర్ణయం... టీవీల వ్యాపారం టీసీఎల్‌కు అప్పగింత
- తన టీవీ వ్యాపారాన్ని చైనా కంపెనీకి అప్పగించిన సోనీ
- హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో 51 శాతం వాటా విక్రయం
- ఇకపైనా సోనీ, బ్రావియా బ్రాండింగ్‌తోనే టీవీలు... డిస్ ప్లే టెక్నాలజీ మాత్రం టీసీఎల్ ది!
- 2027 ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న జాయింట్ వెంచర్
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ సంచలన నిర్ణయం తీసుకుంది. తన ప్రఖ్యాత హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారాన్ని చైనాకు చెందిన టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు అప్పగించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇందులో భాగంగా సోనీ బ్రావియా టీవీ బ్రాండ్‌తో సహా, తన హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో 51 శాతం మెజారిటీ వాటాను టీసీఎల్‌కు విక్రయించనుంది.
ఈ ఒప్పందం ప్రకారం, ఇరు కంపెనీలు కలిసి ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఇది 2027 ఏప్రిల్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. భవిష్యత్తులో టీవీలు సోనీ, బ్రావియా బ్రాండింగ్‌తోనే మార్కెట్లోకి వస్తాయి. అయితే, వాటిలో ఉపయోగించే డిస్‌ప్లే టెక్నాలజీ మాత్రం టీసీఎల్‌కు చెందినదిగా ఉంటుంది. తక్కువ లాభదాయకత ఉన్న టెలివిజన్ తయారీ రంగం నుంచి వైదొలగడంలో భాగంగానే జపాన్ కంపెనీ అయిన సోనీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏర్పాటు ద్వారా తయారీ ఖర్చులు, నష్టాలను తగ్గించుకుంటూనే, ప్రపంచవ్యాప్తంగా తమ బ్రాండ్‌కు ఉన్న గుర్తింపును నిలుపుకోవచ్చని సోనీ భావిస్తోంది. ప్లేస్టేషన్ వ్యాపారంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సోనీ, కొంతకాలంగా సంప్రదాయ ఎలక్ట్రానిక్స్ నుంచి అధిక లాభాలు వచ్చే విభాగాలపై దృష్టి సారిస్తోంది.
మరోవైపు, చైనాకు చెందిన అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సంస్థల్లో ఒకటైన టీసీఎల్, ఇటీవలి కాలంలో ప్రపంచ మార్కెట్లో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అమెరికాలో బడ్జెట్ టీవీ బ్రాండ్‌గా ఎదిగిన ఈ సంస్థ, బ్లాక్‌బెర్రీ, ఆల్కాటెల్ వంటి బ్రాండ్లను కూడా లైసెన్స్ కింద నడుపుతోంది. ఈ ఒప్పందం ద్వారా సోనీ బ్రాండ్ ఇమేజ్‌ను ఉపయోగించుకుని ప్రీమియం టీవీ సెగ్మెంట్‌లో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని టీసీఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన అనుభూతిని అందిస్తామని సోనీ, టీసీఎల్ ప్రతినిధులు తెలిపారు.