ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ ఛైర్మన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

  • దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం
  • ఏఐ, హెల్త్ టెక్, అగ్రి టెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ రంగాల్లో ఇజ్రాయెల్ మద్దతు
  • ఇజ్రాయెల్ స్టార్టప్‌లతో తెలంగాణలో పైలట్ ప్రోగ్రామ్స్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని 'తెలంగాణ రైజింగ్' బృందం దావోస్ పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ ఛైర్మన్ అలోన్ స్టోపెల్‌తో సమావేశమైంది. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), హెల్త్ టెక్, అగ్రి టెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరో స్పేస్ రంగాల్లో తెలంగాణకు ఇజ్రాయెల్ మద్దతునివ్వనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

వ్యవసాయం, వాతావరణ సంబంధిత ఇన్నోవేషన్ స్టార్టప్‌లపై వారి మధ్య చర్చ జరిగింది. ఈ భాగస్వామ్యం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇజ్రాయెల్ స్టార్టప్‌లతో రాష్ట్రంలో పైలట్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.


More Telugu News