తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా ఇదే!

  • తెలంగాణలో పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీ
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో కీలక మార్పులు
  • మొత్తం 20 మంది అధికారులకు కొత్త పోస్టింగులు
  • ఐజీగా గజారావు భూపాల్‌కు పదోన్నతి, అదనపు బాధ్యతలు
తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, మల్కాజ్‌గిరితో పాటు పలు జిల్లాల్లో పనిచేస్తున్న మొత్తం 20 మంది అధికారులకు కొత్త పోస్టింగులు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జీవో ఆర్టీ నెం. 75 ద్వారా ఈ ఉత్తర్వులను విడుదల చేశారు.

ఈ బదిలీల్లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న 2008 బ్యాచ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ గజారావు భూపాల్‌ను ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్ ఐజీగా బదిలీ చేశారు. ఆయనకు స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ ఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డీఐజీగా ఉన్న 2011 బ్యాచ్ అధికారి అభిషేక్ మహంతిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఐజీగా నియమించారు. ఇంటెలిజెన్స్ సీఐ సెల్ ఎస్పీగా ఉన్న ఆర్. భాస్కరన్‌కు డీఐజీగా పదోన్నతి కల్పించి, అదే విభాగంలో కొనసాగించారు.

బదిలీ అయిన అధికారులు, వారి కొత్త పోస్టింగుల వివరాలు:
వ. సంఖ్యఅధికారి పేరుపాత పోస్టింగ్కొత్త పోస్టింగ్
1డాక్టర్ గజారావు భూపాల్జాయింట్ కమిషనర్, ట్రాఫిక్, సైబరాబాద్ఐజీ, ప్రొవిజనింగ్ & లాజిస్టిక్స్
2అభిషేక్ మహంతిడీఐజీ, తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరోడీఐజీ, విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్
3ఆర్. భాస్కరన్ఎస్పీ, సీఐ సెల్, ఇంటెలిజెన్స్డీఐజీ, సీఐ సెల్, ఇంటెలిజెన్స్
4జి. చందన దీప్తిఎస్పీ/డీఐజీ, రైల్వేస్, సికింద్రాబాద్అదనపు సీపీ (అడ్మిన్ & ట్రాఫిక్), ఫ్యూచర్ సిటీ
5టి. అన్నపూర్ణఎస్పీ, విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్డీసీపీ, అడ్మినిస్ట్రేషన్, సైబరాబాద్
6బి.కె. రాహుల్ హెగ్డేడీసీపీ, ట్రాఫిక్, హైదరాబాద్డీసీపీ, ట్రాఫిక్-III, హైదరాబాద్
7కె. అపూర్వ రావుడీసీపీ, స్పెషల్ బ్రాంచ్, హైదరాబాద్ఎస్పీ, ఇంటెలిజెన్స్, హైదరాబాద్
8బి. బాల స్వామిడీసీపీ, ఈస్ట్ జోన్, హైదరాబాద్ఎస్పీ, విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్
9ఆర్. వెంకటేశ్వర్లుడీసీపీ, ట్రాఫిక్-III, హైదరాబాద్ఎస్పీ, సీఐడీ, తెలంగాణ
10ఎస్. చైతన్య కుమార్డీసీపీ, సౌత్ ఈస్ట్ జోన్, హైదరాబాద్డీసీపీ, క్రైమ్స్/డీడీ, హైదరాబాద్
11అవినాష్ కుమార్ఏఎస్పీ, ఆపరేషన్స్, కొత్తగూడెండీసీపీ, ట్రాఫిక్-I, హైదరాబాద్
12కాజల్ఏఎస్పీ, ఉట్నూర్, ఆదిలాబాద్డీసీపీ, ట్రాఫిక్-II, హైదరాబాద్
13ఎస్. శేషాద్రిణి రెడ్డిఏఎస్పీ, అడ్మిన్, జగిత్యాలడీసీపీ, ట్రాఫిక్-II, సైబరాబాద్
14కంకణాల రాహుల్ రెడ్డిఏఎస్పీ, భువనగిరిడీసీపీ, ట్రాఫిక్-I, మల్కాజ్‌గిరి
15శివం ఉపాధ్యాయఏఎస్పీ, ఆపరేషన్స్, ములుగుడీసీపీ, ట్రాఫిక్, ఫ్యూచర్ సిటీ
16వి. శ్రీనివాసులుడీసీపీ, ట్రాఫిక్-II, రాచకొండడీసీపీ, ట్రాఫిక్-II, మల్కాజ్‌గిరి
17జె. రంజన్ రతన్ కుమార్డీసీపీ, ట్రాఫిక్, మేడ్చల్, సైబరాబాద్డీసీపీ, ట్రాఫిక్-I, సైబరాబాద్
18కె. శ్యామ్ సుందర్డీసీపీ, CAR, మల్కాజ్‌గిరిడీసీపీ, CAR హెడ్‌క్వార్టర్స్, హైదరాబాద్
19పి. అశోక్అదనపు డీసీపీ, నార్త్ జోన్, హైదరాబాద్అదనపు ఎస్పీ, విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్
20ఎ. బాలకోటిఅదనపు ఎస్పీ, విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశం

ఈ బదిలీలతో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కమిషనరేట్ల పరిధిలోని పలు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ జోన్లకు కొత్త అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న ఎ. బాలకోటిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గవర్నర్ పేరిట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ ఉత్తర్వులను జారీ చేశారు.


More Telugu News