Babar Azam: బాబర్ అజామ్ ను జట్టు నుంచి తొలగించిన పాక్ సెలెక్టర్లు... బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ కు జట్టు ఎంపిక

Babar Azam Dropped From Pakistan Squad For Bangladesh ODI Series
  • పాక్ జట్టులో పెను మార్పులు.. బాబర్ అజామ్ పై వేటు
  • కెప్టెన్‌గా షహీన్ అఫ్రిది కంటిన్యూ.. జట్టులోకి వచ్చిన రిజ్వాన్
  • ఫఖర్ జమాన్ నసీమ్ షాలపై కూడా వేటు
  • ఆరుగురు కొత్త ఆటగాళ్లకు అవకాశం
ఇటీవల జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2026లో ఘోర వైఫల్యం తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ మెగా టోర్నీలో సూపర్-8 దశలోనే వెనుదిరిగిన పాక్ జట్టులో భారీ ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా మార్చి 11 నుంచి బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ పై వేటు వేసింది.

బాబర్ అజామ్ 2025లో 17 వన్డేల్లో 544 పరుగులు చేసి, శ్రీలంకపై సెంచరీ సాధించినప్పటికీ.. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో దారుణంగా విఫలమయ్యాడు. టోర్నీలో 4 మ్యాచ్‌లు ఆడి కేవలం 91 పరుగులు మాత్రమే చేయడంతో సెలెక్టర్లు అతన్ని పక్కనపెట్టారు. బాబర్ వైఫల్యంపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో, అతనికి వైట్ బాల్ క్రికెట్ నుంచి కాస్త విరామం ఇవ్వాలని సెలెక్టర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

బాబర్‌తో పాటు సీనియర్ ఓపెనర్ ఫఖర్ జమాన్, యువ ఆటగాడు సైమ్ అయూబ్, పేసర్ నసీమ్ షాలకు కూడా ఈ సిరీస్‌లో చోటు దక్కలేదు. ఫఖర్ గత వన్డేల్లో రాణించినా, జట్టు భవిష్యత్తు దృష్ట్యా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావించింది. ఇదే సమయంలో టీ20 వరల్డ్ కప్‌లో రెండు సెంచరీలతో అదరగొట్టిన సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు పిలుపు రాగా.. వికెట్ీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.

వన్డే ప్రపంచకప్ వైఫల్యం తర్వాత విమర్శలు వచ్చినా.. షహీన్ షా ఆఫ్రిదినే కెప్టెన్‌గా కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో ఏకంగా ఆరుగురు అన్-క్యాప్డ్ ప్లేయర్స్ ఉండటం గమనార్హం.

పాక్ జట్టు: షహీన్ షా అఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫైజల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హుస్సేన్ తలత్, మాజ్ సదాకత్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహమ్మద్ వసీం జూనియర్, ముహమ్మద్ ఘాజీ ఘోరీ (వికెట్ కీపర్), సాద్ మసూద్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ ఆఘా, షామిల్ హుస్సేన్.
Babar Azam
Pakistan Cricket
Bangladesh ODI Series
T20 World Cup 2026
Shahid Afridi
Fakhar Zaman
Mohammad Rizwan
Pakistan Cricket Board
Cricket Team Selection

More Telugu News