మంగళగిరిలో క్రికెట్ ఆడి సందడి చేసిన మంత్రి నారా లోకేశ్

  • భోగి ఎస్టేట్స్‌లో ఉత్కంఠ భరితంగా సాగుతున్న మంగళగిరి ప్రీమియర్‌ లీగ్‌ (ఎంపీఎల్) సీజన్‌ - 4 క్రికెట్‌ పోటీలు
  • వల్లభనేని వెంకట్రావ్‌ యూత్‌, విక్కీ 11 జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు టాస్ వేసిన మంత్రి 
  • సరదాగా కాసేపు క్రికెట్ ఆడానన్న లోకేశ్
  • ఫొటోలను ఎక్స్‌లో పోస్టు చేసిన మంత్రి  
మంగళగిరి బైపాస్ రోడ్డులోని భోగి ఎస్టేట్స్‌లో సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) సీజన్ - 4 క్రికెట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ హాజరై క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఎంపీఎల్ - 4లో భాగంగా 27వ రోజు, మూడో రౌండ్ చివరి మ్యాచ్‌గా వల్లభనేని వెంకట్రావ్ యూత్, విక్కీ 11 జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు మంత్రి లోకేశ్ టాస్ వేశారు. అనంతరం సరదాగా ఆయన కాసేపు క్రికెట్ ఆడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన ఆటలో పాల్గొనగానే యువత కేరింతలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను మంత్రి లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నట్టు, సరదాగా కాసేపు క్రికెట్ ఆడినట్లు లోకేశ్ పేర్కొన్నారు. 


More Telugu News