వేడి సాంబారులో పడి చిన్నారి మృతి

  • ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన
  • ఆడుకుంటూ వేడి సాంబారులో పడ్డ ఆరేళ్ల చిన్నారి
  • హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి
జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి సాంబారు ఉన్న పాత్రలో పడి ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన వైరా మండలంలో బుధవారం జరిగింది.

వివరాల్లోకి వెళితే.. వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మునగాల సింహాద్రి, సరోజని దంపతుల కుమార్తె రమ్య శ్రీ (6) ఇంట్లో ఆడుకుంటోంది. ఆ సమయంలో వంట గది సమీపంలో పొయ్యి మీద మరుగుతున్న సాంబారు పాత్రలో అదుపుతప్పి పడిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి, తీవ్రంగా గాయపడిన బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

శరీరం ఎక్కువ భాగం కాలిపోవడంతో రమ్య శ్రీ పరిస్థితి విషమించింది. దీంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని  ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు బాలికను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చిన్నారి కన్నుమూసింది. ఇంట్లో ఆడుకోవాల్సిన పాప ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో ఇందిరమ్మ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 


More Telugu News