మాస్కోలోని బ్రిటన్ దౌత్యవేత్తను బహిష్కరించిన రష్యా.. ఎందుకంటే?

  • మాస్కోలోని బ్రిటిష్ రాయబార కార్యాలయంలో కార్యదర్శిగా ఉన్న గారెత్ శామ్యూల్
  • యూకేలోని రహస్య నిఘా సంస్థల కోసం పనిచేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపిన ఎఫ్ఎస్‌బీ
  • రెండు వారాల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు
రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్‌బీ) మాస్కోలోని బ్రిటిష్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ఒక దౌత్యవేత్తను బహిష్కరించింది. గూఢచర్యం ఆరోపణల ఎదుర్కొంటున్న ఆ దౌత్యవేత్త రెండు వారాల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. బ్రిటిష్ రాయబార కార్యాలయంలో కార్యదర్శిగా ఉన్న గారెత్ శామ్యూల్ డేవిస్ యూకేలోని రహస్య నిఘా సంస్థల కోసం పనిచేస్తున్నట్లు గుర్తించామని, అందుకే సమన్లు జారీ చేసినట్లు ఎఫ్ఎస్‌బీ తెలిపింది.

రష్యా భూభాగంలో ఉంటూ జాతీయ భద్రతా విషయాలను విదేశాల నిఘా సంస్థలకు చేరవేయడాన్ని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని రష్యా విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

తమ చర్యలకు ప్రతిగా బ్రిటన్ ప్రభుత్వం స్పందిస్తే, తాము ప్రతీకార చర్యలకు వెనుకాడేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాల కారణంగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న దౌత్యవేత్తపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది.


More Telugu News