రేవంత్ ప్రభుత్వంపై ఎన్టీవీ జర్నలిస్ట్ దొంతు రమేశ్ విమర్శలు
- మంత్రి, ఐఏఎస్ అధికారిణికి సంబంధించి ఎన్టీవీలో అనుచిత కథనం
- ముగ్గురు జర్నలిస్టులకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు
- రేవంత్ ప్రభుత్వం తమను మానసిక క్షోభకు గురిచేసిందన్న దొంతు రమేశ్
ఓ మంత్రికి, ఒక ఐఏఎస్ అధికారిణికి మధ్య ఏదో సంబంధం ఉందంటూ అనుచిత కథనాన్ని ప్రసారం చేసిన కేసులో ఎన్టీవీ ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేశ్ తో పాటు మరో ఇద్దరు జర్నలిస్టులు చారి, సుధీర్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిని 14వ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు... వారిని రిమాండ్ కు అప్పగించాలని కోర్టును కోరారు. అయితే, రిమాండ్ ను తిరస్కరించిన కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ మంజూరు అయిన అనంతరం దొంతు రమేశ్ మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడిన తర్వాత యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం జరిగిందే కానీ... వర్కింగ్ జర్నలిస్టులను అరెస్ట్ చేయలేదని అన్నారు. చేయని తప్పుకు రేవంత్ ప్రభుత్వం తమను అరెస్ట్ చేసి, 24 గంటల పాటు మానసిక క్షోభకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.