కావలి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

  • ఢిల్లీ నుంచి రేణిగుంటకు వస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పిన వైనం
  • కొంత మేర దెబ్బతిన్న రైల్వే ట్రాక్ 
  • యుద్ద ప్రాతిపదికన ట్రాక్ పునరుద్దరణ పనులు చేపట్టిన రైల్వే అధికారులు
  • పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడిన వైనం
నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఢిల్లీ నుంచి రేణిగుంటకు వస్తున్న గూడ్స్ రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ కొంత మేర దెబ్బతింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అధికారులు, సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణకు సన్నాహాలు చేస్తున్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 


More Telugu News