హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా సిరాజ్

  • హైదరాబాద్ రంజీ జట్టును ప్రకటించిన సెలక్టర్లు
  • వైస్ కెప్టెన్ గా రాహుల్ సింగ్ ఎంపిక
  • 2025-26 రంజీ సీజన్‌లో తదుపరి రెండు మ్యాచ్‌లకు హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌గా సిరాజ్‌ నియామకం
భారత పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. 2025-26 రంజీ సీజన్‌లో తదుపరి రెండు మ్యాచ్‌ల కోసం హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌గా సిరాజ్‌ను నియమిస్తూ సెలెక్టర్లు బుధవారం జట్టును ప్రకటించారు. అంతర్జాతీయ అనుభవం కలిగిన సిరాజ్‌ నాయకత్వంలో హైదరాబాద్‌ జట్టు బరిలోకి దిగనుంది.

హైదరాబాద్‌ రంజీ జట్టు: మహ్మద్‌ సిరాజ్‌ (కెప్టెన్‌), రాహుల్‌ సింగ్‌ (వైస్‌ కెప్టెన్‌), మిలింద్‌, తనయ్‌, రోహిత్‌ రాయుడు, హిమతేజ, వరుణ్‌ గౌడ్‌, అభిరథ్‌ రెడ్డి, రాహుల్‌ రాధేష్‌ (వికెట్‌కీపర్‌), అమన్‌ రావు, రక్షణ్‌ రెడ్డి, నితిన్‌ యాదవ్‌, నితీష్‌ రెడ్డి, ప్రజ్ఞయ్‌, పున్నయ్య.

స్టాండ్‌బై: మికిల్‌, అవినాష్‌ రావు, కార్తికేయ, ప్రణవ్‌, పి. నితీష్‌ రెడ్డి. 


More Telugu News