కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా: అనసూయ

  • శివాజీపై వ్యాఖ్యల తర్వాత విమర్శలు ఎదుర్కొంటున్న అనసూయ
  • తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకే కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నానని వెల్లడి
  • న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్న అనసూయ
సినీ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన కామెంట్లు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నటి అనసూయ భరద్వాజ్, సింగర్ చిన్మయి లాంటి వాళ్లు శివాజీపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో, అనసూయ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.

తాను గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని అనసూయ తెలిపారు. "ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. అనవసర ఆందోళనలు వద్దు. ఒక మహిళగా నా అభిప్రాయం, స్వేచ్ఛ వ్యక్తపరచినందుకే ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కానీ ఇలాంటి అనుభవాల నుంచే మరింత బలం పొందుతున్నా. నా వెనుక నిలిచిన ధైర్యవంతమైన మహిళల మద్దతు నాకు గొప్ప శక్తి. మనమందరం మనుషులమే. భావోద్వేగాలు, బలహీన క్షణాలు సహజం. సిగ్గుపడను. నిజమైన బలం ఏమిటంటే... కష్టాలు వచ్చినా మళ్లీ లేచి నిలబడటమే. క్లిక్‌బైట్‌లు, ఊహాగానాలకు దూరంగా ఉండండి. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. నా తరపున నిలబడిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి క్లిష్ట సమయంలో లభించే గౌరవం, తోడ్పాటు నా గొప్ప ఆస్తి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు" అని ఇన్స్టాలో పేర్కొన్నారు.


More Telugu News