అంబరాన్నంటిన భోగి వేడుకలు... స్టెప్పులతో ఇరగదీసిన అంబటి రాంబాబు.. వీడియో ఇదిగో

  • భోగి వేడుకలతో కళకళలాడుతున్న ఏపీ జిల్లాలు
  • గుంటూరులో అంబటి రాంబాబు భోగి వేడుకలు
  • తమ యూనివర్శిటీలో కుటుంబ సభ్యలతో కలిసి మోహన్ బాబు వేడుకలు

భోగి పండుగ సందర్భంగా ఏపీలోని జిల్లాలు కళకళలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే భోగి మంటలతో గ్రామాలు, పట్టణాలు సందడిగా మారాయి. రంగు రంగుల ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు, కోలాటాల స్వరాల మధ్య భోగి వేడుకల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.


గుంటూరులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు సాగుతున్నాయి. భోగి వేడుకల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. మధ్యమధ్యలో ఉత్సాహంగా స్టెప్పులు వేసి అందరినీ ఆనందపరిచారు.


తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో కూడా భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మోహన్ బాబు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తండ్రితో కలిసి హీరో మంచు విష్ణు భోగి మంటలు వేశారు. సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహిస్తూ, మన తెలుగు సంప్రదాయాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా మోహన్ బాబు పిలుపునిచ్చారు. యూనివర్సిటీ ప్రాంగణం మొత్తం పండుగ కళలతో వెల్లివిరిసింది.



More Telugu News