ఆ పొరపాటును సరిదిద్దుకోండి.. ట్రంప్ సర్కారుకు కోర్టు హితవు
- పరిపాలనాధికారుల తప్పిదంతో విద్యార్థినిని హోండూరస్ కు డిపోర్ట్ చేసిన వైనం
- తమ ఆదేశాలను అతిక్రమించి విద్యార్థినిని డిపోర్ట్ చేయడంపై ఆగ్రహం
- మళ్లీ స్టూడెంట్ వీసా జారీ చేసి అమెరికాకు తీసుకురావాలని ఆదేశం
అక్రమ వలసదారులపట్ల కఠినంగా వ్యవహరించిన ట్రంప్ సర్కారు.. వందలాదిమంది అక్రమ వలసదారులను వెతికి పట్టుకుని డిపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ విద్యార్థినిని ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేసి హోండూరస్ కు పంపించారు. అయితే, అరెస్టయిన వెంటనే ఆమె తరఫున లాయర్లు కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆమెకు 72 గంటల పాటు రక్షణ కల్పించింది. అయినప్పటికీ అధికారులు ఆమెను డిపోర్ట్ చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు విద్యార్థిని విషయంలో జరిగిన అడ్మినిస్ట్రేటివ్ పొరపాటును సరిదిద్దుకోవాలని, వెంటనే ఆమెకు స్టూడెంట్ వీసా జారీ చేసి వెనక్కి రప్పించాలని ట్రంప్ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే..
హోండూరస్ కు చెందిన అని లూసియా లోపెజ్ బెల్లోజా ఎనిమిదేళ్ల వయసులో తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వలస వచ్చింది. ప్రస్తుతం ఆమె వయస్సు 19 సంవత్సరాలు.. కాలేజీలో విద్యాభ్యాసం చేస్తోంది. అమెరికా చట్టాల ప్రకారం తాత్కాలిక వీసాతో వలస వచ్చిన వారి పిల్లలు మైనారిటీ తీరగానే తమ స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఆ లోగా గ్రీన్ కార్డ్ పొందితే సరే.. లేదంటే దేశం వీడాల్సిందే.
లోపెజ్ బెల్లోజా ఈ నిబంధనను ఉల్లంఘించిందనే ఆరోపణలతో ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను గతేడాది నవంబర్ 20న బోస్టన్ లో అరెస్టు చేశారు. దీనిపై ఆమె న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. లోపెజ్ ను 72 గంటల పాటు ఎక్కడికీ తరలించవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ అధికారులు ఆమెను నవంబర్ 22న హోండూరస్ కు తిప్పిపంపారు.