ఇది మాకు శుభశకునం... తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈవో
- కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆశిష్‌కుమార్ చౌహాన్
- ఎక్స్ఛేంజ్, దేశ శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు
- ఐపీఓ ఆమోదంపై ప్రకటన రావడం శుభశకునమన్న చౌహాన్
- ఈ నెలలోనే ఎన్ఎస్ఈ ఐపీఓకు సెబీ ఆమోదం లభించే అవకాశం
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆశిష్‌కుమార్ చౌహాన్ ఆదివారం కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్ఎస్ఈ, దాని సభ్యులు, వాటాదారులు, దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎన్ఎస్ఈ ఐపీఓకు సెబీ నుంచి ఆమోదం లభించవచ్చనే సానుకూల సంకేతాలు వెలువడిన మరుసటి రోజే ఈ పర్యటన జరగడం విశేషం.
ఈ ఉదయం శ్రీవారి దర్శనం ఎంతో సంతృప్తినిచ్చిందని చౌహాన్ పేర్కొన్నారు. "ఈరోజు ఉదయం తిరుమలలో మాకు అద్భుతమైన దర్శనం లభించింది. ఎన్ఎస్ఈతో పాటు మా సభ్యులు, వాటాదారులు, దేశం కోసం ఆశీర్వాదం తీసుకున్నాం" అని ఆయన వివరించారు.
ఈ పర్యటన చాలా ముందుగానే ఖరారైందని, అయితే తాను తిరుపతికి చేరుకున్న సమయంలోనే ఎన్ఎస్ఈ ఐపీఓకు సంబంధించిన ప్రకటన వెలువడటం యాదృచ్ఛికమని చౌహాన్ అన్నారు. దీనిని తాను ఒక శుభశకునంగా, దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఎన్ఎస్ఈ ఐపీఓకు ఈ నెలలోనే ఆమోదం లభించవచ్చని సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే సూచించారని చౌహాన్ తెలిపారు. భారత క్యాపిటల్ మార్కెట్ల చరిత్రలో ఎన్ఎస్ఈ ఐపీఓ అత్యంత ముఖ్యమైన లిస్టింగ్‌లలో ఒకటిగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కీలక తరుణంలో శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని, ఇది చిరస్మరణీయమని చౌహాన్ పేర్కొన్నారు.