రిపబ్లిక్ డే వేడుకల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్.. ఎందుకంటే..!

  • ఢిల్లీలో ఘనంగా జరగనున్న వేడుకలు
  • విమానాలను పక్షులు ఢీ కొట్టకుండా ఏర్పాట్లు
  • ఎర్రకోట, జామా మసీద్ ప్రాంతాల్లో పక్షులకు ఆహారంగా చికెన్
రిపబ్లిక్ డే వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఢిల్లీవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కర్తవ్య పథ్‌లో జరిగే పరేడ్ కోసం త్రివిధ దళాలు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాయి. యుద్ధ విమానాలతో విన్యాసాల కోసం వైమానిక దళం విస్తృత సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే 1275 కిలోల చికెన్ ను ఆర్డర్ పెట్టారని సమాచారం.

రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా వైమానిక దళం ఆకాశంలో చేసే విన్యాసాలకు ఆటంకం కలగకుండా పక్షులకు ఆహారంగా ఇచ్చేందుకు చికెన్ ఆర్డర్ చేశారట. ఆకాశంలో ఎగిరే విమానాలను పక్షులు ఢీ కొంటే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎర్రకోట, జామా మసీద్ వంటి 20 ప్రాంతాల్లో జనవరి 15 నుంచి 26 వరకు గద్దల కోసం మాంసం విసిరే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. 


More Telugu News