విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్.. వాడొద్దంటూ తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ వార్నింగ్
- అమ్మకాలపై నిషేధం విధించిన అధికారులు
- రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్ ఇన్ స్పెక్టర్లకు సూచనలు
- కల్తీ జరిగిన సిరప్ బ్యాచ్, తయారీ వివరాల వెల్లడి
అత్యంత విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ ఈ ఆల్మంట్ కిడ్ సిరప్ లో కలిసిందని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు గుర్తించి ఈ మేరకు తెలంగాణ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో ఆల్మంట్ కిడ్ సిరప్ అమ్మకాలను నిషేధిస్తూ, ఇప్పటికే కొనుగోలు చేసిన తల్లిదండ్రులకు తెలంగాణ అధికారులు హెచ్చరికలు చేశారు. ఇందుకోసం టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు, సహాయ సంచాలకులందరికీ, ఈ ఉత్పత్తి బ్యాచ్‌కు సంబంధించిన అందుబాటులో ఉన్న స్టాక్‌లను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇథిలీన్ గ్లైకాల్ విషపూరిత ప్రభావాల వల్ల కలిగే అనారోగ్యాలకు సంబంధించిన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని ఆసుపత్రులకు సూచనలు చేశారు.
కల్తీ అయిన సిరప్ వివరాలు..
అల్మాంట్-కిడ్ సిరప్ (లెవోసెటిరిజైన్ డైహైడ్రోక్లోరైడ్, మోంటెలుకాస్ట్ సోడియం సిరప్)
బ్యాచ్ నెం. AL-24002
తయారీ తేదీ జనవరి-2025
గడువు తేదీ డిసెంబర్-2026