ఉర్దూ యూనివర్సిటీ భూముల అంశం... ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం

  • ఉర్దూ వర్సిటీ భూములకు సంబంధించి ప్రభుత్వం నోటీసులు
  • నందినగర్‌లో విద్యార్థులతో సమావేశమైన కేటీఆర్
  • కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ స్నాచర్‌గా వ్యవహరిస్తోందని వ్యాఖ్య
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములకు సంబంధించి ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో నందినగర్‌లో విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ స్నాచర్‌లా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం భూములు లాక్కోవడం ఇదే మొదటిసారి కాదని ఆయన అన్నారు.

జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కూడా 100 ఎకరాలు తీసుకున్నారని, ఈ విషయానికి సంబంధించి విద్యార్థులు పోరాడినప్పటికీ ఆందోళనను అణిచివేశారని అన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనూ ఇదే విధమైన భూదందా చేశారని మండిపడ్డారు. అక్కడ 400 ఎకరాలు తీసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా తీసుకుని ఆదేశాలు ఇచ్చేవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు.


More Telugu News