Harry Brook: హ్యారీ బ్రూక్ అద్భుతంగా ఆడాడు.. అందుకే ఓడిపోయాం: పాక్ కెప్టెన్ ఆవేదన!
- ఇంగ్లండ్‌తో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమి
- బ్యాటింగ్‌లో బాగానే మొదలుపెట్టినా.. చివర్లో తడబడ్డామన్న సల్మాన్
- 164 పరుగులు చేసిన పాక్.. సునాయాసంగా ఛేదించిన ఇంగ్లండ్
టీ20 ప్రపంచకప్ సూపర్ 8లో పాకిస్థాన్‌కు నిరాశ ఎదురైంది. మంగళవారం క్యాండీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఓటమి పాలైంది. తమ బ్యాటర్లు తక్కువ స్కోరుకే పరిమితం కావడం, ఆపై ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అద్భుతంగా రాణించడం వల్లే ఓడిపోయామని పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా అంగీకరించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (63) అర్ధశతకంతో రాణించగా, బాబర్ ఆజం (25), ఫఖర్ జమాన్ (25), షాదాబ్ ఖాన్ (23*) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లతో సత్తా చాటగా, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
మ్యాచ్ అనంతరం సల్మాన్ మాట్లాడుతూ.. "బ్యాటింగ్‌లో మంచి ఆరంభమే లభించింది. కానీ అనుకున్న రీతిలో ముగించలేకపోయాం. మా స్కోరు కాస్త తక్కువైంది. హ్యారీ బ్రూక్ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నాడు" అని చెప్పాడు. ఫర్హాన్ టోర్నీ ఆద్యంతం బాగా ఆడుతున్నాడని, కానీ ఇతర బ్యాటర్లు విఫలమయ్యారని సల్మాన్ అంగీకరించాడు.
షహీన్ షా అఫ్రిది అద్భుతంగా బౌలింగ్ చేశాడని సల్మాన్ ప్రశంసించాడు. ఆరంభంలోనే వికెట్లు తీసి జట్టుకు బ్రేక్ ఇచ్చాడని కొనియాడాడు. "హ్యారీ బ్రూక్‌ను కట్టడి చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించాం. కానీ అతడు గ్రౌండ్‌లో అన్ని వైపులా షాట్లు ఆడగలడు. అతడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే" అని వివరించాడు. చివర్లో నవాజ్ వేసిన 19వ ఓవర్‌తో తమలో కాస్త ఆశ రేగిందని, ఒక శాతం అవకాశం ఉన్నా తమ జట్టు పోరాడుతుందని సల్మాన్ తెలిపాడు.