డ్రగ్స్ దందా... కువైట్‌లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష

  • హెరాయిన్, మెథాంఫెటమైన్‌లతో పట్టుబడిన భారతీయులు
  • నిందితులకు అంతర్జాతీయ డ్రగ్స్ నెట్ వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడి
  • ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు
కువైట్‌ న్యాయస్థానం మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష విధించింది. హెరాయిన్, మెథాంఫెటమైన్‌లతో పట్టుబడిన ఇద్దరికి అక్కడి న్యాయస్థానం మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించిన కువైట్ అంతర్గత వ్యవహారాల శాఖ, ఇటీవల ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు కైఫాన్, షువైఖ్ ప్రాంతాల్లో నిఘా పెట్టి ఇద్దరు భారతీయులను అరెస్టు చేశారు.

వారి వద్ద నుంచి 14 కిలోల హెరాయిన్, 8 కిలోల మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని సమాచారం. ఈ మేరకు ఆధారాలను ప్రాసిక్యూటర్లు కోర్టులో ప్రవేశపెట్టగా, దోషులకు మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.


More Telugu News