పెళ్లి రూమర్స్‌పై స్పష్టతనిచ్చిన నటి మీనాక్షి చౌదరి

  • తనపై రూమర్స్ ఎలా సృష్టిస్తారో అర్దం కావడం లేదన్న మీనాక్షి
  • టాలీవుడ్ యంగ్ హీరోతో త్వరలో పెళ్లంటూ రూమర్స్ 
  • ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్న మీనాక్షి  
నటి మీనాక్షి చౌదరి తన వివాహం గురించి సోషల్ మీడియా, సినీ వర్గాల్లో వస్తున్న ఊహాగానాలకు స్వయంగా స్పందించారు. నవీన్ పొలిశెట్టితో కలిసి ఆమె నటించిన 'అనగనగా ఒక రాజు' చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తనపై రూమర్లు ఎలా సృష్టిస్తారో అర్థం కావడం లేదని అన్నారు.

తాను ఎటువంటి వివాహ ప్రకటన చేయలేదని మీనాక్షి స్పష్టం చేశారు. కథ, పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. తన పెళ్లి గురించి వస్తున్న రూమర్లను విని విసిగిపోయానని, వాటిలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేశారు.

టాలీవుడ్‌కు చెందిన ఒక యువ హీరోతో మీనాక్షి ప్రేమలో ఉన్నారని, కొంతకాలంగా వీరు డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని ఇటీవల పుకార్లు వ్యాపించాయి. ఆమె టీమ్ ఈ రూమర్లను ఖండించినప్పటికీ అవి ఆగలేదు. ఈ నేపథ్యంలో మీనాక్షి స్వయంగా స్పందించి ఈ ఊహాగానాలకు తెరదించారు. 


More Telugu News