: బంగ్లాదేశ్ లో ఒకేరోజు మూడు ఘోరాలు.. హిందువులపై ఆగని అకృత్యాలు
- ఉదయం మహిళపై గ్యాంగ్ రేప్.. సాయంత్రం ఓ జర్నలిస్ట్, రాత్రి ఓ వ్యాపారి హత్య
- మైనారిటీలపై కొనసాగుతున్న దాడులు
- భయాందోళనలతో గడుపుతున్న కుటుంబాలు
బంగ్లాదేశ్ లో హిందువులపై హింసకు అంతులేకుండా పోయింది. సోమవారం ఒక్కరోజే మూడు దారుణాలు చోటుచేసుకున్నాయి. ఉదయం ఓ వితంతువుపై గ్యాంగ్ రేప్ జరగగా, సాయంత్రం ఓ జర్నలిస్టును దుండగులు కాల్చి చంపారు. రాత్రి ఓ వ్యాపారిపై కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఈ వరుస దారుణాలతో అక్కడి హిందువులు తీవ్ర భయాందోళనల మధ్య జీవిస్తున్నారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. నార్సింగ్ది జిల్లా కేంద్రంలోని బ్రాహ్మండికి చెందిన శరత్ చక్రవర్తి మణి స్థానికంగా ఓ కిరాణా షాపు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. మణి గతంలో దక్షిణ కొరియాకు వెళ్లి కొంతకాలం పనిచేసి వచ్చాడు. అక్కడ సంపాదించుకుని వచ్చిన సొమ్ముతో బ్రాహ్మండిలో ఓ ఇల్లు కట్టుకున్నాడు. ప్రస్తుతం కిరాణా షాపుతో వచ్చే ఆదాయంతో కుటుంబం గడుపుకుంటున్నాడు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి పది గంటల సమయంలో కొంతమంది దుండగులు మణి షాపు వద్దకు వచ్చారు. వచ్చీరావడంతోనే కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో మణి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆపై దుండగులు పారిపోగా.. స్థానికులు మణిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మణిని పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించాడని ప్రకటించారు.
ఈ దారుణానికి ముందు సోమవారం ఉదయం కాళీగంజ్ లో 40 ఏళ్ల హిందూ వితంతువుపై దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు. చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించారు. మరో ఘటనలో.. సాయంత్రం జశోర్ జిల్లా కాపాలియా బజార్ లో స్థానిక దినపత్రికకు ఎడిటర్ గా వ్యవహరిస్తున్న జర్నలిస్ట్ రాణా ప్రతాప్ అనే యువకుడిని దుండగులు హత్య చేశారు. కాపాలియా బజార్ లో ఓ ఐస్ ఫ్యాక్టరీని కూడా నిర్వహిస్తున్న రాణా ప్రతాప్ ను అతడి ఫ్యాక్టరీ దగ్గరే దారుణంగా కాల్చి చంపారు. సోమవారం ఒక్కరోజే మూడు దారుణాలు చోటుచేసుకున్నాయి.