సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన ఓయూ ఐకాస
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఐకాస విఫలయత్నం చేసింది. గుంపుగా సీఎం క్యాంప్ కార్యాలయం వైపు కదులుతున్న విద్యార్థులను పోలీసులు గమనించి అడ్డుకున్నారు. మరోవైపు ఓయూ ఎన్సీసీ గేటు దగ్గర విద్యార్థులు పోలీసులపై రాళ్లు విసిరారు.