అమెరికాలో తెలుగు యువతి హత్య... తమిళనాడులో నిందితుడి అరెస్ట్

  • మేరీల్యాండ్ లోని అపార్ట్ మెంట్ లో విగతజీవిగా కనిపించిన నిఖిత గొడిశాల
  • ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మపై వారెంట్ జారీ
  • భారత్ కు పారిపోయి వచ్చిన అర్జున్‌ శర్మ
  • తమిళనాడులో అర్జున్ శర్మను అరెస్ట్ చేసిన పోలీసులు
అమెరికాలో హత్యకు గురైన తెలుగు యువతి నిఖిత గొడిశాల కేసులో అనుమానితుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్ పోల్ నోటీసు నేపథ్యంలో నిఖిత మాజీ ప్రియుడు అర్జున్ శర్మను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిఖితను హత్య చేసి మృతదేహాన్ని తన అపార్ట్ మెంట్ లో దాచి అర్జున్ భారత్ కు పారిపోయివచ్చాడు. నిఖిత మృతదేహం బయటపడడంతో మేరీల్యాండ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిఖిత మాజీ ప్రియుడు అర్జున్ శర్మ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, నిఖిత హత్య తర్వాత అర్జున్ శర్మ దేశం విడిచి భారత్ కు పారిపోయినట్లు గుర్తించి ఇంటర్ పోల్ నోటీసులు జారీ చేశారు.

ఏం జరిగిందంటే..
మేరీల్యాండ్ లోని ఓ అపార్ట్ మెంట్ లో తెలుగు యువతి నిఖిత గొడిశాల హత్యకు గురైంది. ఆమె మాజీ ప్రియుడి అపార్ట్ మెంట్లో విగతజీవిగా కనిపించింది. నిఖిత హత్య కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ కోసం గాలించగా భారత్ కు పారిపోయినట్లు బయటపడింది. దీంతో నిఖితను అతడే హత్య చేశాడని భావించిన పోలీసులు.. ఇంటర్ పోల్ నోటీసులు జారీ చేశారు. భారత్‌కు పరారైన అర్జున్‌ను గుర్తించేందుకు పోలీసులు ఫెడరల్‌ అధికారుల సాయం కోరారు.


More Telugu News