కొత్త సంవత్సరం వేడుకల వేళ టిప్ గా రూ.501... డెలివరీ బాయ్ ఎమోషనల్ స్పందన
- న్యూ ఇయర్ వేళ డెలివరీ ఏజెంట్‌కు రూ.501 టిప్ ఇచ్చిన కస్టమర్
- ఆలస్యంగా డెలివరీ చేసినా కస్టమర్ చూపిన దయ
- "పెట్రోల్ ఖర్చులకు డబ్బులొచ్చాయి" అంటూ డెలివరీ బాయ్ భావోద్వేగ రిప్లై
- సోషల్ మీడియాలో వైరల్ అయిన వాట్సాప్ చాట్
- గిగ్ వర్కర్ల కష్టాలను తెలియజేస్తున్న ఘటనగా నెటిజన్ల ప్రశంసలు
న్యూ ఇయర్ వేడుకల వేళ ఓ ఫుడ్ డెలివరీ బాయ్ కి కస్టమర్ ఇచ్చిన భారీ టిప్, దానికి ఆ యువకుడు ఇచ్చిన భావోద్వేగపూరిత సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన గిగ్ వర్కర్ల కష్టాలను, చిన్నపాటి దయ చూపడం వల్ల కలిగే గొప్ప ప్రభావాన్ని తెలియజేస్తోంది.
వివరాల్లోకి వెళితే, డిసెంబర్ 31 రాత్రి ఓ కస్టమర్ 'ఈట్‌క్లబ్' యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేశారు. రాత్రి 8:34 గంటలకు చేసిన ఆర్డర్, సుమారు గంటన్నర ఆలస్యంగా రాత్రి 10 గంటలకు డెలివరీ అయింది. డెలివరీ చేసిన బిట్టు అనే యువకుడు, తనకు ఇంకా 30 ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయంటూ తీవ్ర ఒత్తిడి నడుమ చెప్పాడు.
అందరూ కొత్త సంవత్సర వేడుకల్లో ఉన్నప్పుడు, బిట్టు నవ్వుతూ తన పని తాను చేసుకుపోవడం చూసి కస్టమర్ చలించిపోయాడు. అతనికి మంచి నీళ్లు ఇచ్చి, కాసేపు విశ్రాంతి తీసుకోమని సూచించాడు. ఆ తర్వాత డెలివరీ బాయ్ బిట్టు అక్కడ్నించి వెళ్లిపోయాడు. అయితే, ఆ కస్టమర్ సదరు ఫుడ్ యాప్ నుంచి బిట్టు నంబర్ తీసుకుని, యూపీఐ ద్వారా రూ.501 టిప్‌గా పంపాడు. "హ్యాపీ న్యూ ఇయర్, ఇది మీ కుటుంబానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా" అని మెసేజ్ పెట్టాడు.
దీనికి బిట్టు వాట్సాప్‌లో స్పందిస్తూ, "వెరీ వెరీ థాంక్ యు సో మచ్ సర్, ముఝే పెట్రోల్ కే లియే పైసా హో గయా" (సార్, చాలా చాలా ధన్యవాదాలు. పెట్రోల్ కు డబ్బులు లేని సమయంలో... మీరు పంపిన డబ్బుతో నాకు పెట్రోల్ ఖర్చు తీరిపోతుంది) అని రిప్లై ఇచ్చాడు. ఈ చాట్‌ను కస్టమర్ 'ఎక్స్' లో పోస్ట్ చేస్తూ, "ఈ రైడర్లు మన హీరోలు. మన జీవితాలను సులభతరం చేస్తారు. ఏ పనీ చిన్నది కాదు" అని రాసుకొచ్చారు.