రష్మిక వెకేషన్ పిక్స్‌లో విజయ్ సోదరుడు.. వైరల్ అవుతున్న ఇన్‌స్టా పోస్ట్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక రోమ్ ట్రిప్ ఫొటోలు
- రష్మిక షేర్ చేసిన పిక్స్‌లో మెరిసిన ఆనంద్ దేవరకొండ
- కెమెరామెన్ విజయ్ దేవరకొండేనా అంటూ నెటిజన్ల కామెంట్స్
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా రష్మిక షేర్ చేసిన కొన్ని వెకేషన్ ఫొటోలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం రష్మిక ఇటలీలోని రోమ్ నగరంలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడి అందాలను ఆస్వాదిస్తూ దిగిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
రష్మిక "Rome so far" అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చారిత్రక కట్టడాల మధ్య పోజులివ్వడం, స్నేహితులతో కలిసి రోమ్ వీధుల్లో సందడి చేయడం, గర్ల్ గ్యాంగ్‌తో డ్యాన్సులు చేయడం వంటి దృశ్యాలు అందులో ఉన్నాయి. అయితే, ఈ ఆల్బమ్‌లో ఓ ఫొటోలో విజయ్ దేవరకొండ సోదరుడు, హీరో ఆనంద్ దేవరకొండ కనిపించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఫొటోలో రష్మిక, ఆనంద్ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతూ కనిపించారు. విజయ్ తమ్ముడు కూడా రష్మికతో పాటే వెకేషన్‌లో ఉండటంతో.. విజయ్ దేవరకొండ కూడా కచ్చితంగా అక్కడే ఉండి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు.
ఈ ఫొటోలు చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. "విజయ్ ఎక్కడ ఉన్నారు?", "ఈ ఫొటోలు తీసింది విజయ్ దేవరకొండేనా?" అంటూ సరదాగా ప్రశ్నిస్తున్నారు. గతంలో 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట.. అప్పటి నుంచి మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. తరచుగా విజయ్ ఇంటి ఫ్యామిలీ ఫంక్షన్లలో రష్మిక కనిపిస్తుండటం, ఇద్దరూ ఒకే రకమైన ప్రదేశాల నుంచి ఫొటోలు షేర్ చేస్తుండటంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే చర్చ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో నడుస్తోంది. తాజా ఫొటోలతో ఈ రూమర్స్ మరోసారి ఊపందుకున్నాయి.