డిప్రెషన్ కన్నా ఇదే ఎక్కువ భయపెడుతోంది: ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ షాకింగ్ కామెంట్స్!
- తాను లావుగా, ఒబేసిటీతో బాధపడుతున్నట్లు అంగీకరించిన ఇరా ఖాన్
- 2020 నుంచి శరీర బరువు, ఆకృతిపై పోరాడుతున్నట్టు వెల్లడి
- డిప్రెషన్ గురించి మాట్లాడటం కన్నా ఇది భయంగా ఉందన్న ఇరా
- శరీర ఆకృతి సమస్యలు తన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వెల్లడి
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తన శరీర బరువు, ఆకృతి (బాడీ ఇమేజ్) సమస్యలపై తాజాగా స్పందించారు. తాను లావుగా ఉన్నానని, ఒబేసిటీతో బాధపడుతున్నానని సోషల్ మీడియా వేదికగా అంగీకరించారు. ఈ విషయం గురించి మాట్లాడాలంటే కాస్త భయంగా ఉందని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
"అవును, నేను లావుగా ఉన్నాను. 2020 నుంచి లావుగా ఉన్నాననే భావనతో అధిక బరువు, ఒబేసిటీ మధ్య ఊగిసలాడుతున్నాను. నా శరీరం గురించి నేను ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే, నాలో ఒక చిన్న సానుకూల మార్పు కనిపించడంతో దీని గురించి మాట్లాడటం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నా" అని ఇరా తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. గతంలో తాను ఎదుర్కొన్న డిప్రెషన్ గురించి మాట్లాడినంత ధైర్యంగా, స్పష్టంగా దీని గురించి మాట్లాడలేకపోవచ్చని, ఎందుకంటే ఇది తనకు కొంచెం భయంగా అనిపిస్తోందని ఆమె వివరించారు.
ఈ పోస్ట్‌కు జత చేసిన వీడియోలో కూడా ఇరా ఇదే విషయంపై మాట్లాడారు. "2020 నుంచి నా ఆహారపు అలవాట్లు, శరీర ఆకృతితో నేను పోరాడుతున్నాను. ఈ సమస్య నా స్నేహితులతో, నా భాగస్వామితో నా సంబంధాలపై, నా ఆత్మగౌరవంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను" అని ఆమె తెలిపారు.
ఇరా ఖాన్ గతంలో తాను డిప్రెషన్‌తో సుదీర్ఘకాలం పోరాడిన విషయాన్ని కూడా బహిరంగంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాడీ ఇమేజ్ సమస్యలపై ఆమె మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.