మారేడుమిల్లికి వెళ్లే పర్యాటకులకు పోలీసుల హెచ్చరిక

  • మందు పాతరలను గుర్తించిన భద్రతాబలగాలు
  • కొనసాగుతున్న మందు పాతరలను వెలికి తీసే కార్యక్రమం
  • పని పూర్తయ్యేంత వరకు ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలోని అటవీ ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. ఈ క్రమంలో, అక్కడకు వెళ్లే పర్యాటకులకు పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. గత నెలలో మారేడుమిల్లి ప్రాంతంలో ఎన్ కౌంటర్లు జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన కూంబింగ్ లో మారేడుమిల్లిలోని లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ప్రెజర్ మైన్లు, ల్యాండ్ మైన్లు అమర్చినట్టు గుర్తించారు. భద్రతాదళాలను హతమార్చేందుకు మావోలు వీటిని అమర్చారు. 

ప్రస్తుతం కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలు... వీటిని వెలికితీసే పనిలో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని మైన్లను వెలికి తీశాయి. మరోవైపు, మారేడుమిల్లి లోతట్టు ప్రాంతాలను జల్లెడపట్టి మిగిలిన మందు పాతరలను కూడా వెలికి తీసే చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మందు పాతరలను వెలికి తీసేంతవరకు పర్యాటకులు, ప్రజలు లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు.


More Telugu News