Hyderabad Municipal Elections: మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల ముందు.. పెద్ద మొత్తంలో నగదు పట్టివేత
- రూ.67 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న గోషామహల్ పోలీసులు
- నిందితులు కొంతకాలంగా నగదు అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు
- నగదు, నిందితులను ఆదాయపన్ను శాఖకు అప్పగించిన పోలీసులు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల ముందు హైదరాబాద్‌లో పోలీసులు పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న రూ.67 లక్షలను గోషామహల్ పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి జ్యోతారామ్, గణ్‌పత్‌రామ్, మహేందర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరు ముగ్గురు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా నగదు అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బేగంబజార్‌కు చెందిన కపిలేశ్ సూచనల మేరకు నిందితులు అఫ్జల్‌గంజ్‌లో ఒక వ్యక్తి వద్ద నుంచి రూ.67 లక్షలకు పైచిలుకు నగదు తీసుకుని తమ ముఠా సభ్యులకు అప్పగించేందుకు వెళుతుండగా, సమాచారం అందుకున్న పోలీసులు వారి స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో నగదును స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్టు చేశారు. నిందితులను, నగదును ఆదాయపన్ను శాఖకు అప్పగించారు.