ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురి మృతి

  • ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడెం ప్లైఓవర్ వద్ద ఘటన
  • ఒకే బైక్ పై వెళుతున్న ముగ్గురు యువకులు ప్రమాదంలో మృతి
  • మృతులు ద్వారకా తిరుమల ప్రాంత వాసులుగా గుర్తింపు 
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భీమడోలు మండలం సూరప్పగూడెం ఫ్లైఓవర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో అతివేగం లేదా ఇతర కారణాల వల్ల వాహనం అదుపుతప్పి ఫ్లైఓవర్ వద్ద ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. మృతులను ద్వారకా తిరుమల ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

సమాచారం అందుకున్న వెంటనే భీమడోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫ్లైఓవర్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 


More Telugu News