5 కోట్లతో 50 కోట్లు కొల్లగొట్టిన సినిమా .. ఓటీటీలో!

  • మలయాళంలో నిర్మితమైన 'ఎకో'
  • నవంబర్లో విడుదలైన సినిమా 
  • అడవి నేపథ్యంలో సాగే కంటెంట్ 
  • ఈ నెల 31 నుంచి 'నెక్స్ట్ ఫ్లిక్స్'లో 
  • 5 భాషల్లో అందుబాటులోకి  

మలయాళం ఇండస్ట్రీ క్రితం ఏడాదిలో అద్భుతాలు సృష్టించింది. చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు, వందల కోట్లను వసూలు చేశాయి. ఈ ఏడాది కూడా అదే రికార్డును కొనసాగిస్తూ వెళ్లింది. అలాంటి రికార్డులను సాధించిన సినిమాల జాబితాలో 'ఎకో' ఒకటిగా కనిపిస్తుంది. సందీప్ వినీత్ .. నరేన్ .. బినూ పప్పు .. సౌరభ్ సచ్ దేవా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, దింజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించాడు. 

జయరామ్ నిర్మించిన ఈ సినిమాకి, కథ - స్క్రీన్ ప్లేను బాహుల్ రమేశ్ అందించాడు. ముజీబ్ సమకూర్చిన నేపథ్య సంగీతం మంచి మార్కులు కొట్టేసింది. నవంబర్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా, అక్కడి థియేటర్స్ నుంచి పాజిటివ్ టాక్ ను రాబట్టింది. కేవలం 5 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 50 కోట్లకి పైగా వసూలు చేయడం విశేషం. ఈ ఏడాది చివరిలో మలయాళ విజయపరంపరను కొనసాగించిన సినిమా ఇది. 

అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను 'నెట్ ఫ్లిక్స్'వారు దక్కించుకున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి మలయాళంతో పాటు, తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో  స్ట్రీమింగ్ చేయనున్నారు. కొంతమంది ఆగంతకులు, ఒక నిందితుడి కోసం గాలిస్తూ అడవిలోని ఓ కొండపైకి చేరుకుంటారు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ అడవిలోని రహస్యాలేమిటి? అనేది కథ. 



More Telugu News