ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచంటే..!

  • జనవరి 10 నుంచి 18 వరకు మొత్తం 9 రోజుల సెలవులు
  • ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లకు వర్తింపు
  • జనవరి 19న తిరిగి పాఠశాలల పునఃప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మొత్తం 9 రోజుల పాటు సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సెలవులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

పండగ సెలవుల అనంతరం జనవరి 19వ తేదీ సోమవారం నాడు పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని విద్యాశాఖ తెలిపింది. ఈ సెలవుల కారణంగా అకడమిక్ క్యాలెండర్‌లో గానీ, పరీక్షల షెడ్యూల్‌లో గానీ ఎలాంటి మార్పులు ఉండబోవని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా విద్యార్థులకు 9 రోజుల పాటు సంక్రాంతి పండుగకు సెలవులు లభించనున్నాయి.


More Telugu News