కంబోడియా సైబర్ ముఠా గుట్టురట్టు చేసిన ఏపీ సీఐడీ
- పశ్చిమ బెంగాల్ లో అంతర్జాతీయ నేరస్తుడి అరెస్ట్
- విశాఖ, బెంగాల్, ఒడిశా కేంద్రంగా సిమ్ బాక్స్ కేంద్రాలు
- 1400 సిమ్ కార్డుల స్వాధీనం
కంబోడియా దేశం నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా నెట్ వర్క్ ను ఏపీ సీఐడీ పోలీసులు ఛేదించారు. ఏపీలోని విశాఖపట్నంతో పాటు బెంగాల్, ఒడిశా కేంద్రంగా నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు చెందిన నేరస్తుడిని పశ్చిమ బెంగాల్ లో అరెస్టు చేశారు.
డైరెక్టరేట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు. నిందితుడి దగ్గరి నుంచి 1400 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విశాఖపట్నం, బెంగాల్, ఒడిశాలలో సిమ్ బాక్స్ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.