ఏపీలో పాస్టర్‌లకు సర్కార్ క్రిస్మస్ కానుక ..

  • పాస్టర్‌లకు గౌరవ వేతనం బకాయిలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం 
  • పాస్టర్‌లకు రూ.50.50కోట్లు విడుదల 
  • 8,418 మంది పాస్టర్‌ల ఖాతాల్లో గౌరవ వేతనం బకాయిలు జమ
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పాస్టర్లకు క్రిస్మస్ కానుకను అందించింది. రాష్ట్రంలోని 8,418 మంది పాస్టర్ల గౌరవ వేతన నిధులను బుధవారం విడుదల చేసింది. 2023 డిసెంబర్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు మొత్తం రూ.50,50,80,000ను జమ చేసింది. అంటే నెలకు రూ.5 వేల చొప్పున 12 నెలలకు రూ.60 వేల చొప్పున ప్రతి పాస్టర్ ఖాతాకు డబ్బు చేరింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల్లో పాస్టర్లకు గౌరవ వేతనం బకాయిలు జమ అయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు క్రైస్తవ సోదరుల కుటుంబాల్లో వేడుకలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు మొదటి నుంచి క్రైస్తవుల ఆపద్బాంధవుడిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 


More Telugu News