చైనా రాజీపడని ప్రయోజనాల్లో భారత్లోని అరుణాచల్ ప్రదేశ్: పెంటగాన్ రిపోర్టు
- నాయకత్వ పరిధిని మరింత విస్తరించాలని చైనా భావిస్తున్నట్లు తెలిపిన పెంటగాన్
- తైవాన్, సెంకాకులతో పాటు అరుణాచల్ ప్రదేశ్లు బీజింగ్ ప్రణాళికల్లో భాగమని వెల్లడి
- చైనా జాతీయ పునరుజ్జీవానికి ఈ భూభాగాలు కీలకమని చైనా భావిస్తోందని నివేదిక
ఈ భూభాగాలు చైనా జాతీయ పునరుజ్జీవనానికి కీలకమని డ్రాగన్ భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. చైనా కమ్యూనిస్టు పాలనను వ్యతిరేకించిన హాంగ్కాంగ్, టిబెట్, తైవాన్ రాజకీయ నాయకులను వేర్పాటువాదులుగా ముద్ర వేసినట్లు కూడా నివేదిక తెలిపింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ భారత్, చైనా మధ్య కుదిరిన గస్తీ ఒప్పందం గురించి పెంటగాన్ తన నివేదికలో ప్రస్తావించింది.
భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించడానికి చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెంటగాన్ నివేదిక పేర్కొంది. అమెరికా, భారత్ మధ్య సంబంధాలు మరింత బలపడకుండా ఉండేలా చైనా జాగ్రత్త పడుతోందని వివరించింది. జాతీయ పునరుజ్జీవనానికి బీజింగ్ మూడు ప్రధాన ప్రయోజనాలను లక్ష్యంగా పెట్టుకుందని, అందులో చైనా కమ్యూనిస్టు పార్టీపై నియంత్రణ, దేశ ఆర్థికాభివృద్ధి, సార్వభౌమాధికారం, ప్రాదేశిక వాదనలు కొనసాగించడం వంటివి ఉన్నాయని పేర్కొంది.