మెస్సీ భారత పర్యటన ఖర్చు రూ.100 కోట్లు: విచారణలో కీలక విషయాలు వెల్లడి
- మెస్సీకి రూ.89 కోట్లు చెల్లించినట్లు వెల్లడించిన ఈవెంట్ నిర్వాకుడు
- తాకడం, కౌగిలించుకోవడం వంటి చర్యలతో మెస్సీ స్టేడియం వీడినట్లు వెల్లడి
- మెస్సీ పర్యటన కోసం ప్రభుత్వానికి రూ.11 కోట్లు పన్ను చెల్లింపు
సమాచారం ప్రకారం, స్టేడియంలోకి రాగానే అనేకమంది తాకడం, కౌగిలించుకోవడం వంటి చర్యలతో మెస్సీ అసౌకర్యానికి గురయ్యాడని, దీంతో అతడు షెడ్యూల్ కంటే ముందుగానే అక్కడి నుంచి వెళ్లిపోయాడని దత్తా చెప్పారు. జనసమూహాన్ని అదుపు చేయాలని పదేపదే ప్రకటించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని విచారణలో వెల్లడించారు. మైదానంలోకి రావడానికి 150 మందికి మాత్రమే పాసులు ఉన్నాయని, కానీ అంతకు మూడు రెట్లు ఎక్కువ మంది వచ్చారని తెలిపారు.
మెస్సీ పర్యటనకు మొత్తం రూ.100 కోట్లు ఖర్చయిందని శతద్రు వెల్లడించారు. మెస్సీకి రూ.89 కోట్లు చెల్లించామని, భారత ప్రభుత్వానికి రూ.11 కోట్లు పన్నుగా చెల్లించామని తెలిపాడు. ఈ నిధుల్లో 30 శాతం స్పాన్సర్ల ద్వారా, మరో 30 శాతం టిక్కెట్లు విక్రయం ద్వారా సేకరించినట్లు ఆయన చెప్పాడని సమాచారం.