Ramdev Baba: లైవ్ డిబేట్‌లో ప్యానెలిస్ట్‌తో కుస్తీకి దిగిన‌ బాబా రామ్‌దేవ్‌.. చివ‌రికి..!

Ramdev Baba Wrestling Move Backfires in Live TV Debate
  • ఓ టీవీ ఛానల్ లైవ్ డిబేట్‌లో రామ్‌దేవ్‌, ప్యానెలిస్ట్ మ‌ధ్య మల్ల యుద్ధం
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
  • సరదాకే చేశానన్న రామ్‌దేవ్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఒక జాతీయ టీవీ ఛానల్ లైవ్ డిబేట్‌లో ఒక ప్యానెలిస్ట్‌తో కుస్తీకి దిగారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఆయనపై ట్రోల్స్ చేస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే.. అమర్ ఉజాలా టీవీ ఛానల్ నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చర్చ మధ్యలో తన బలాన్ని ప్రదర్శించేందుకు రామ్‌దేవ్ బాబా.. తన ఎదురుగా ఉన్న ప్యానెలిస్ట్‌పై ఓ కుస్తీ ఎత్తుగడ ప్రయోగించబోయారు. అయితే, ఆ ప్యానెలిస్ట్ అంతే వేగంగా స్పందించి, రామ్‌దేవ్‌ను నిలువ‌రించేందుకు య‌త్నించారు. దాంతో ప్యానెలిస్ట్ ను కిందపడేయడంలో రామ్‌దేవ్ బాబా విఫలమ‌య్యారు. 

అయితే, జరిగిన దానిపై రామ్‌దేవ్ బాబా స్పందిస్తూ అదంతా కేవలం సరదా కోసం చేసిందేనని, సీరియస్‌గా తీసుకోవద్దని వివరణ ఇచ్చారు. కానీ, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. రామ్‌దేవ్ వేసిన ఎత్తుగడ ఆయనకే రివర్స్ అయిందంటూ సెటైర్లు వేస్తున్నారు. "పతంజలి నెయ్యి తింటే ఇలాగే జరుగుతుంది" అని కొందరు, "స్కామ్‌దేవ్" అంటూ మరికొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరోవైపు టీవీ ఛానళ్లు రేటింగ్స్ కోసం చర్చా కార్యక్రమాలను కుస్తీ పోటీలుగా మారుస్తున్నాయంటూ మీడియా విశ్లేషకులు విమర్శిస్తున్నారు. 
Ramdev Baba
Baba Ramdev
Ramdev wrestling
Ramdev controversy
TV debate
wrestling move reverse
Amar Ujala TV
yoga guru
social media trolls
Patanjali ghee

More Telugu News