సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో అగ్ని ప్రమాదం
- శ్రీరామ ఎంటర్‌ప్రైజెస్ దుకాణంలో చెలరేగిన మంటలు
- దట్టమైన పొగలు అలముకోవడంతో స్తంభించిన ట్రాఫిక్
- చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించకుండా అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించకుండా నిరోధించారు. అగ్ని ప్రమాదం సంభవించిన దుకాణంలో ప్లాస్టిక్ వస్తువులు అధికంగా ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.