ఎవరికీ చెప్పకుండా ఉండాల్సింది: లైంగిక వేధింపుల కేసులో మలయాళ బాధిత నటి వ్యాఖ్య
- 2017 కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ఆరుగురిని దోషులుగా తేల్చిన కోర్టు
- నటుడు దిలీప్‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
- తనపై సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేశారని నటి ఫిర్యాదు
- ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దన్న నటి
తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేశారని, తీర్పు వెలువడిన కొద్దిరోజులకు బాధిత నటి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆ వీడియోను ప్రచారం చేసిన 21 సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు గుర్తించారు. ఈ పరిణామాలపై బాధిత నటి స్పందించారు.
ఆ ఘటన గురించి తాను ఎవరికీ చెప్పకుండా ఉండాల్సిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నిందితుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో కనిపించిందని ఆమె పేర్కొన్నారు. ఈ పరిస్థితి మీకు, మీ కుటుంబ సభ్యులకు రాకూడదని, తనను సాధారణ జీవితం గడపనీయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. "బాధితురాలిగా కాదు, ప్రాణాలతో బయటపడిన వ్యక్తిగా కూడా కాదు, ఒక సాధారణ మహిళగా నన్ను బతకనీయండి" అని ఆమె కోరారు.