ఆస్ట్రేలియాలో కాల్పులతో హైదరాబాద్‌కు సంబంధం లేదు: డీజీపీ
- బోండీ బీచ్‌లో కాల్పులు జరిగిన సాజిద్ అక్రమ్
- సాజిద్ అక్రమ్ హైదరాబాదీయే కానీ ఉగ్ర ఘటనతో నగరానికి సంబంధం లేదన్న శివధర్ రెడ్డి
- 1998లో ఉన్నతవిద్యాభ్యాసం కోసం వెళ్లి అక్కడే స్థిరపడినట్లు వెల్లడి
సాజిద్‌కు హైదరాబాద్ మూలాలు ఉండటంతో, ఈ కాల్పుల ఘటనపై డీజీపీ మరోసారి స్పందించారు. 1998లో ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ అక్రమ్ ఆరుసార్లు భారత్ వచ్చాడని, ఆస్ట్రేలియాలోనే యూరోపియన్ యువతిని వివాహం చేసుకున్న తర్వాత 1998లో భార్యతో పాటు ఒకసారి హైదరాబాద్‌కు వచ్చాడని వెల్లడించారు.
2004, 2009, 2011, 2016లో ఆయన వచ్చాడని అన్నారు. 2016లో ప్రాపర్టీ సెటిల్‌మెంట్ కోసం వచ్చాడని, 2022లో చివరిసారి తల్లి, సోదరిని చూడటం కోసం వచ్చాడని తెలిపారు.
కాగా, బోండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 16 మంది మృతి చెందారు.