ఆస్ట్రేలియాలో కాల్పులతో హైదరాబాద్‌కు సంబంధం లేదు: డీజీపీ

  • బోండీ బీచ్‌లో కాల్పులు జరిగిన సాజిద్ అక్రమ్
  • సాజిద్ అక్రమ్ హైదరాబాదీయే కానీ ఉగ్ర ఘటనతో నగరానికి సంబంధం లేదన్న శివధర్ రెడ్డి
  • 1998లో ఉన్నతవిద్యాభ్యాసం కోసం వెళ్లి అక్కడే స్థిరపడినట్లు వెల్లడి
ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్‌లో కాల్పులకు పాల్పడిన సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌కు చెందినవాడే అయినప్పటికీ, ఆ ఉగ్ర ఘటనతో హైదరాబాద్‌కు సంబంధం లేదని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పులు జరిపిన వారిలో సాజిద్‌ అక్రమ్‌కు హైదరాబాద్‌ మూలాలు ఉన్నట్లు బయటపడింది. పాతబస్తీకి చెందిన అతడు 1998లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆస్ట్రేలియా వెళ్లి, అక్కడే యూరోపియన్‌ మూలాలున్న వెనెరా గ్రాసో అనే మహిళను వివాహం చేసుకొని స్థిరపడ్డాడు.

సాజిద్‌కు హైదరాబాద్ మూలాలు ఉండటంతో, ఈ కాల్పుల ఘటనపై డీజీపీ మరోసారి స్పందించారు. 1998లో ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ అక్రమ్ ఆరుసార్లు భారత్ వచ్చాడని, ఆస్ట్రేలియాలోనే యూరోపియన్ యువతిని వివాహం చేసుకున్న తర్వాత 1998లో భార్యతో పాటు ఒకసారి హైదరాబాద్‌కు వచ్చాడని వెల్లడించారు.

2004, 2009, 2011, 2016లో ఆయన వచ్చాడని అన్నారు. 2016లో ప్రాపర్టీ సెటిల్‌మెంట్ కోసం వచ్చాడని, 2022లో చివరిసారి తల్లి, సోదరిని చూడటం కోసం వచ్చాడని తెలిపారు. 

కాగా, బోండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 16 మంది మృతి చెందారు.


More Telugu News