'అఖండ 2' సక్సెస్.. వారణాసిలో బాలయ్య, బోయపాటి ప్రత్యేక పూజలు

  • 'అఖండ 2' సినిమా ఘన విజయం
  • వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన చిత్ర బృందం
  • సంప్రదాయ పట్టువస్త్రాల్లో కనిపించిన బాలకృష్ణ, బోయపాటి
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా విజయోత్సాహంలో భాగంగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను వారణాసిలో పర్యటించి కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు.

సినిమా సక్సెస్ అయిన సందర్భంగా చిత్ర బృందం వారణాసిలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ పర్యటనలో బాలకృష్ణ, బోయపాటి ఇద్దరూ సంప్రదాయ పట్టు వస్త్రాలు ధరించి కనిపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

డిసెంబర్ 12న విడుదలైన 'అఖండ 2' చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. హిందుత్వం, ఆధ్యాత్మికత నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటించారు.


More Telugu News