భారత్‌తో సంబంధాల కోసం.. కీలకమైన డిఫెన్స్ పాలసీపై ట్రంప్ సంతకం
- డిఫెన్స్ పాలసీలో కీలక అంశాలు
- డిఫెన్స్ రంగంలో భారత్‌తో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం
- స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో-పసిఫిక్ ప్రాంత ఉమ్మడి లక్ష్యాల సాధన
- చైనాతో జరుగుతున్న వ్యూహాత్మక పోటీలో ఆధిపత్యం పొందడం
భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన వార్షిక రక్షణ విధాన బిల్లుపై (డిఫెన్స్ పాలసీ) సంతకం చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాతో కొనసాగుతున్న వ్యూహాత్మక పోటీలో ఆధిపత్యం సాధించడానికి క్వాడ్ కూటమి ద్వారా భారత్‌తో సంబంధాలను విస్తృతం చేయాలని అమెరికా భావిస్తోంది.
ట్రంప్ సంతకం చేసిన ది నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్-2026లో భారత్‌తో రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం, క్వాడ్ కూటమి ద్వారా స్వేచ్ఛాయుతమైన, బహిరంగ ఇండో-పసిఫిక్ ప్రాంత లక్ష్యాలను సాధించడం, చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొని అమెరికా ప్రయోజనాలను పరిరక్షించడం వంటి అంశాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, దేశీయంగా, విదేశాల నుంచి వచ్చే బెదిరింపుల నుంచి దేశాన్ని కాపాడటానికి, రక్షణ పారిశ్రామిక రంగ పునాదులను బలోపేతం చేయడానికి ఈ చట్టం ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. భారత్‌తో రక్షణ రంగంలో మరింత సహకారం ద్వారానే ఇండో-పసిఫిక్ రీజియన్ లో చైనాపై ఆధిపత్యం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
ఈ బిల్లు అమలులోకి వస్తే ఇరు దేశాల మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు, రక్షణ వాణిజ్యం, విపత్తుల సమయంలో మానవతా సహాయం, సముద్ర భద్రత వంటి అంశాల్లో సహకారం వంటి ప్రయోజనాలు ఉండనున్నాయి.