మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్.. 500 మందికి క్యాన్సర్ చికిత్స
- రొమ్ము క్యాన్సర్ బాధితులకు కొత్త జీవితం అందించినట్లు వెల్లడి
- 500 కుటుంబాల్లో ఆనందం నింపడం సంతోషంగా ఉందన్న రియల్ హీరో
- సమష్టి కృషితోనే ఇలాంటి పనులు చేయగలమని వ్యాఖ్య
‘రొమ్ము క్యాన్సర్ బాధిత మహిళలు 500 మందిని మేం కాపాడగలిగాం. శస్త్రచికిత్సతో వారందరికీ కొత్త జీవితం లభించింది. 500 కుటుంబాలలో ఆనందం నింపినందుకు సంతోషంగా ఉంది. సమష్టి కృషితోనే ఇలాంటి గొప్ప పనులు జరుగుతాయి’ అని సోనూసూద్ తెలిపారు.
కాగా, కరోనా సమయంలోనూ సోనూ సూద్ పలు దాతృత్వ కార్యక్రమాలు చేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కాలంలో వలస కూలీలను సొంత ఖర్చులతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి మరీ స్వస్థలాలకు పంపించి ఆయన రియల్ హీరో అనిపించుకున్నారు.