రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన.. కేంద్రమంత్రులతో వరుస భేటీ

  • కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్‌లను కలిసిన సీఎం
  • విజన్ డాక్యుమెంట్‌ను అందజేసిన ముఖ్యమంత్రి
  • యంగ్ ఇండియా స్కూళ్లకు పెట్టే ఖర్చును ఎఫ్ఆర్‌బీఎం పరిధి నుంచి తొలగించాలని విజ్ఞప్తి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిశారు. రెండు రోజుల క్రితం మెస్సీతో మ్యాచ్ అనంతరం ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రెండు రోజులుగా ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఆయన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్‌లతో భేటీ అయ్యారు.

తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను నిర్మలా సీతారామన్‌కు అందజేశారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు పెట్టే ఖర్చును ఎఫ్ఆర్‌బీఎం పరిధి నుంచి తొలగించాలని రేవంత్ రెడ్డి కోరారు. అనంతరం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమయ్యారు.


More Telugu News