కోల్‌కతాలో మెస్సీ పర్యటనలో గందరగోళం కేసులో మరో ఇద్దరు అరెస్టు
- స్టేడియంలోని కుర్చీలని ధ్వంసం చేసి, గందరగోళం సృష్టించిన కేసు
- శుభోప్రతిమ్, గౌరబ్ బసు అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఇప్పటికే ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తా అరెస్టు
ఈ ఘటనపై పూర్తి నివేదికను మరో 15 రోజుల్లో ప్రభుత్వానికి అందజేస్తామని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.